వచ్చే ఏడాది హరితహారంలో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లాలో 25.45 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్ల కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు. హన్మకొండలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి హరితహారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది 53 లక్షల మొక్కలు నాటేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆయా శాఖలు లక్ష్యాన్ని సత్వరమే పూర్తి చేయాలని సూచించారు.
హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయాలి : కలెక్టర్ - హరితహారంపై వరంగల్ అర్బన్ కలెక్టర్ సమీక్ష
హరితహారంలో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లాలో ఈ ఏడాది పెట్టుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. వచ్చే ఏడాది 25.45లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ముందస్తుగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
warangal urban collector
నాటిన మొక్కలకు జియో ట్యాగింగ్ చేస్తే లక్ష్యాన్ని సాధించినట్లు భావిస్తారని... వంద శాతం సర్వేయల్ తప్పని సరిగా ఉండాలన్నారు. ముందస్తుగా ప్రణాళిక చేసుకుంటే నర్సరీలో మొక్కలు పెంచే అవకాశం ఉంటుందని... అందుకోసం ప్రభుత్వం ముందస్తుగా ప్రణాళిక రూపొందించి నివేదించాలని కోరినట్లు కలెక్టర్ వివరించారు.
ఇదీ చదవండి :సామాజిక మధ్యమాల్లో నకిలీ ఖాతాలకు అడ్డుకోవాలి: సజ్జనార్