ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు ముందుగా సిద్ధంగా ఉండాలని అధికారులకు కలెక్టకర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారుకు ఆదేశించారు. భవిష్యత్తులో ఎలాంటి విపత్తు వచ్చినా తట్టుకునేలా శాశ్వతమైన పరిష్కారమార్గం సూచించాలన్నారు.
ఇరిగేషన్ అధికారుతో కలెక్టర్ సమీక్ష - అధికారులతో కలెక్టర్ హనుమంతు సమీక్ష
భవిష్యత్తులో నగరంలో భారీ వర్షాలు, వరదల వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అవసరమైన పరిష్కార మార్గాలు సూచించాలని వరంగల్ అర్బన్‌జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. విపత్తులను ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లపై ఇరిగేషన్ అధికారులతో చర్చించారు.
![ఇరిగేషన్ అధికారుతో కలెక్టర్ సమీక్ష ఇరిగేషన్ అధికారుతో కలెక్టర్ సమీక్ష](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8718404-786-8718404-1599501830820.jpg)
ఇరిగేషన్ అధికారుతో కలెక్టర్ సమీక్ష
జిల్లాలో వరదల వలన కలిగిన నష్టంపై ఇరిగేషన్ ఇన్ చీఫ్ అనిల్‌కుమార్... పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్‌కు వివరించారు. బొంది వాగు వరద నీరు నేరుగా భద్రకాళి చెరువులోకి పోయే విధంగా బ్రిడ్జి నిర్మించాలని సూచించారు. సమావేశంలో నగర పాలక కమిషనర్ పమేలా సత్పతీ ఇతర అధికారులు పాల్గొన్నారు.