రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని వరంగల్ అర్బన్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. హన్మకొండలోని దూపకుంట, న్యూ శాయంపేటలో పర్యటించి... అక్కడ నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పురోగతిని పరిశీలించారు. రెండు పడక గదుల నిర్మాణ వేగం పెంచాలని సూచించారు.
రెండు పడక గదుల ఇళ్లు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్
వరంగల్ అర్బన్ జిల్లాలో నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్లను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుంతు పరిశీలించారు. పనుల వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 15 నాటికి దాదాపు 400 డబుల్ బెడ్ రూం ఇళ్లను పూర్తి చేయాలన్నారు.
రెండు పడక గదుల ఇళ్లు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్
సుమారు 150 నుంచి 200 మంది కార్మికులతో 24 గంటలపాటు పనులు చేయాలన్నారు. ఫిబ్రవరి 15 నాటికి దాదాపుగా 400 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. స్లాబ్లు వేసిన బ్లాకుల్లో ఇటుక పని, దర్వాజాలు, కిటికీలు, నీటి ట్యాంక్ నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు.
ఇదీ చదవండి:మంకీ పార్టీ: ఓ చేతిలో స్నాక్స్.. మరో చేతిలో కూల్ డ్రింక్.!