ఎమ్మెల్సీ ఓటరుగా అర్హులైన పట్టభద్రుల జాబితాలో తన పేరును నమోదు చేసుకున్నారు వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ హనుమంతు. నల్గొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు ఫామ్ 18 దరఖాస్తు నింపి హన్మకొండ తహశీల్దార్ కిరణ్ ప్రకాష్ కు తన ఛాంబర్ లో కలెక్టర్ అందజేశారు.
ఎమ్మెల్సీ ఓటరుగా పేరు నమోదు చేసుకున్న వరంగల్ అర్బన్ కలెక్టర్ - Collector rajiv hanumanthu filled form-18 for him
వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ హనుమంతు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరుగా తన పేరును నమోదు చేసుకున్నారు. ఫామ్-18ని పూర్తి చేసి హనుమకొండ తహశీల్దార్ కు అందజేశారు.
ఎమ్మెల్సీ ఓటరుగా పేరు నమోదు చేసుకున్న వరంగల్ అర్బన్ కలెక్టర్
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు నవంబర్ 6 వరకు తుది గడువు ఉన్నందున అర్హులు అందరూ నమోదు చేసుకోవాలని సూచించారు. గ్రాడ్యుయేట్లు తప్పకుండా తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇవీ చదవండి: 'ప్రభుత్వం నోటిఫై చేసిన కులాలకే రిజర్వేషన్'