వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని కలెక్టరేట్లో టీబీ నియంత్రణ అధికారులతో పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ వ్యాధి నివారణకు అధికారులు చేపట్టిన చర్యల పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక నుంచి సేవల్లో మెరుగు పడని పక్షంలో ఉపేక్షించేది లేదన్నారు.
సమష్టిగా ముందుకెళదాం.. టీబీని తరిమికొడదాం: కలెక్టర్ - TB Decease in Warngal urban district
వరంగల్ అర్బన్ జిల్లాలో టీబీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తూ జిల్లాను టీబీ రహిత జిల్లాగా మారుద్దామని పేర్కొన్నారు.
![సమష్టిగా ముందుకెళదాం.. టీబీని తరిమికొడదాం: కలెక్టర్ Warangal Urban Collector Rajiv gandi Hanmanthu Review meeting on TB Decease](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7743177-241-7743177-1592930512734.jpg)
టీబీ రహిత జిల్లాగా మారుద్దాం: కలెక్టర్
ప్రైవేటు ఆసుపత్రుల్లో గుర్తించిన రోగుల వివరాలను ప్రతిరోజు నిక్షయ పోర్టల్లో సాయంత్రంలోగా నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేసి సమాచారం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి సూచించారు. పోర్టల్లో నమోదు చేసుకున్న వారికి మందులు ఉచితంగా అందించటంతో పాటుగా చికిత్స కాలం పూర్తయ్యే వరకు నెలకు 500 రూపాయలు నేరుగా రోగి ఖాతాలో జమవుతాయని వెల్లడించారు.
TAGGED:
Collecter samiksha