వరంగల్ అర్బన్ జిల్లాలో ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ సేవలను హసన్‌పర్తి తహసీల్దార్ కార్యాలయంలో... కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. తొలుత మండలంలోని రేపకపల్లెకు చెందిన మల్లేశం తన కుమారుడు వీర స్వామికి 1.03 ఎకరాల భూమిని గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. మొదటి రోజు 14 రిజిస్ట్రేషన్లు జరిగినట్లు వెల్లడించారు.
తొలిరోజు ధరణి సేవలు... 15నిమిషాల్లో నమోదు పూర్తి - ధరణిపై వరంగల్ అర్బన్ కలెక్టర్ ముఖాముఖి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్ సేవలు ప్రారంభం అయ్యాయి. కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా దీనిని అందుబాటులోకి తీసుకువచ్చారు. వరంగల్ అర్బన్ జిల్లాలో మొదటి రోజు నమోదు ప్రక్రియలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. 14 రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తెలిపారు. ధరణి పోర్టల్ వినియోగంపై కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
![తొలిరోజు ధరణి సేవలు... 15నిమిషాల్లో నమోదు పూర్తి warangal-urban-collector-rajiv-gandhi-hanumant-special-interview-on-dharani](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9399666-561-9399666-1604306214006.jpg)
తొలిరోజు ధరణి సేవలు... 15నిమిషాల్లో నమోదు పూర్తి
సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమ లేకుండా పదిహేను నిమిషాల్లోనే నమోదు ప్రక్రియ పూర్తవతుందని చెప్పారు. ధరణి వినియోగం, సమస్యలపై కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
తొలిరోజు ధరణి సేవలు... 15నిమిషాల్లో నమోదు పూర్తి
ఇదీ చదవండి:'హ్యాండ్ బాల్'ను ఒలంపిక్స్‌కు తీసుకెళ్లడమే లక్ష్యం: జగన్మోహన్ రావు