వరంగల్ కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోని చెరువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. హన్మకొండలోని కుడా కార్యాలయంలో జరిగిన చెరువుల సంరక్షణ కమిటీ సమావేశంలో నిర్ణయించిన అంశాల అమలును సమీక్షించారు. వాటిపై పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలన్నారు.
చెరువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ - warangal urban collector rajeev gandhi hanumanthu updates
హన్మకొండలోని వరంగల్ కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో చెరువుల సంరక్షణపై వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సమీక్ష నిర్వహించారు. నగరంలోని చెరువులకు ఎఫ్టీఎల్ ప్రకారం సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు.
![చెరువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ warangal urban collector rajeev gandhi hanumanthu on ponds at hanmakonda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8987556-927-8987556-1601396421215.jpg)
చెరువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్
నగరంలో ఉన్న చెరువులకు ఎఫ్టీఎల్ ప్రకారం సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఎఫ్టీఎల్ పరిధిలో పట్టా, ప్రభుత్వ భూముల్లో ఎన్ని గృహాలున్నాయో సర్వే చేసి నివేదిక అందచేయాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. బఫర్ జోన్ పరిధిలోని భూములకు నాలా బదలాయింపు అనుమతులు ఇవ్వకూడదని ఈ కమిటీలో నిర్ణయించారు.