నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల శాసన మండలికి ఓటరు నమోదులో ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలియజేయాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కోరారు. హన్మకొండలోని కలెక్టరేట్ మినీ సమావేశంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు చెందిన జిల్లా ప్రతినిధులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఓటరు నమోదుకు కావలసిన ఫారం 18 దరఖాస్తులని తహసీల్దార్ కార్యాలయంలో సిద్ధం చేశామని అన్నారు. ఇంకా ఏమైనా దరఖాస్తులు తక్కువగా ఉన్నట్లు భావిస్తే ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
మొత్తం 87 పోలింగ్ కేంద్రాలు..