నగరంలో ఉగాది పండుగ నుంచి ఇంటింటికి మిషన్ భగీరథ తాగునీటిని అందించేందుకు వేగంగా చర్యలు తీసుకోవాలని వరంగల్ అర్బన్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.. అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో.. బల్దియా, పబ్లిక్ హెల్త్, ఆర్ అండ్ బీ ఇంజినీర్లతో ఆయన సమావేశం జరిపారు.
'నగరంలో ఉగాది నుంచి ఇంటింటికి తాగునీరు'
వరంగల్ అర్బన్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.. కలెక్టరేట్లో అధికారులతో సమావేశమయ్యారు. నగరంలో ఉగాది నుంచి.. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మిషన్ భగీరథ నీటిని అందించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
'నగరంలో ఉగాది నుంచి ఇంటింటికి తాగునీరు'
మహానగర పాలక సంస్థ పరిధిలో అమృత్ పథకం కింద.. పైపు లైన్లు, నల్లా కనెక్షన్లు, ఫిల్టర్ బెడ్ల నవీకరణ, స్మార్ట్ సిటీ పనుల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. అసంపూర్తిగా ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. లీకేజీలు ఉన్న పైపులైన్ల స్థానంలో కొత్తవి వేయాలని సూచించారు.
ఇదీ చదవండి:పది, ఇంటర్ పరీక్షలు ఉంటాయా..? విద్యార్థులు,తల్లిదండ్రుల్లో ఉత్కంఠ