ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో నూతన రెవెన్యూ చట్టం ప్రవేశ పెట్టడాన్ని హర్షిస్తూ హన్మకొండలో తెరాస శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు.
'నూతన రెవెన్యూ చట్టంతో ప్రజలకెంతో లాభం' - వరంగల్లో కొత్త రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ సంబురాలు
రాష్ట్రంలో నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టడాన్ని హర్షిస్తూ హన్మకొండలో తెరాస కార్యక్తలు సంబురాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
'ప్రజల సమస్యలు పరిష్కరానికై నూతన రెవెన్యూ చట్టం'
ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంస్కరణలు తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. కొత్త రెవెన్యూ చట్టం వల్ల ప్రజలందరికీ మేలు జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:కార్పొరేట్ ఆస్పత్రుల దందా అరికడతాం: కేసీఆర్