రేపటి నుంచి జరుగనున్న మేడారం మహా జాతర వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. సుఖమంతంగా ప్రయాణం చేసేందుకు ఆర్టీసీ బస్సులను సిద్ధం చేశామని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ శ్రీధర్ తెలిపారు. జాతర సందర్భంగా మొత్తం 4,000 బస్సులు వేయగా.. వరంగల్ జిల్లాకే 2,200 బస్సులను కేటాయించామని చెప్పారు.
వరంగల్ నుంచి మేడారం జాతరకు 2,200 బస్సులు - latest news of warangal
రేపటి నుంచి జరుగనున్న మేడారం మహా జాతరకు వరంగల్ జిల్లా నుంచి 2,200 బస్సులను సిద్ధం చేశామని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ శ్రీధర్ తెలిపారు. ప్రజలకు ఏ ఇబ్బందులు కలుగకుండా అన్నీ ఏర్పాటు చేశామన్నారు.
![వరంగల్ నుంచి మేడారం జాతరకు 2,200 బస్సులు warangal to medaram special bubses in warangal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5953006-1079-5953006-1580808888970.jpg)
వరంగల్ నుంచి మేడారం జాతరకు 2,200 బస్సులు
హన్మకొండ నుంచి రోజుకు 335 బస్సులను తిప్పుతామని అన్నారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బస్టాండ్ల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య శిబిరం వంటివి ఏర్పాటు చేసింది.
వరంగల్ నుంచి మేడారం జాతరకు 2,200 బస్సులు