వరంగల్ అర్బన్ జిల్లా హసన్ పర్తి పరిధిలోని జయగిరి గ్రామ శివారులో కోడిపందాలు నిర్వహిస్తున్న ఐదుగురిని టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 3,260 రూపాయలు, 4పందెం కోళ్లు, 3ద్విచక్ర వాహనాలు, 4సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
జోరుగా కోడిపందాలు.. పోలీసుల అదుపులో ఐదుగురు - Warangal Task Force Police Latest News
జయగిరి శివారులో కోడిపందాలు నిర్వహిస్తున్న ఐదుగురుని వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగదు, ద్విచక్ర వాహనాలు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారిని హసన్పర్తి పోలీసులకు అప్పగించారు.

పందెం కోళ్లు స్వాధీనం చేసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు
అదుపులోకి తీసుకున్న వారిని తదుపరి చర్యల కోసం హసన్ పర్తి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పినట్లు టాస్క్ఫోర్స్ అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి:చంచల్గూడ జైలుకు మాజీమంత్రి అఖిలప్రియ