తెలంగాణ

telangana

ETV Bharat / state

2020 ఓ పీడకల: ఓరుగల్లును వణికించిన కరోనా! - వరంగల్​లో కరోనా ప్రభావం

2020 ఎప్పటికీ ఎవ్వరూ మరిచిపోలేని సంవత్సరం.. కరోనా సంవత్సరంగా ప్రజలకు గుర్తుండి పోతుంది. లాక్​డౌన్, రెడ్​జోన్, కంటైన్మెంట్, క్వారంటైన్, ఐసొలేషన్ అన్న పదాలే తెలియని ప్రజలకు.. చిరకాలం గుర్తిండిపోయేలా చేసింది. ఈ ఏడాది ఎప్పుడు వెళ్లిపోతుందా.. కొత్త సంవత్సరం సాధారణ జీవితాలను తీసుకొస్తే చాలని ప్రజలు అనుకునేలా చేసింది.. కరోనా.. 2020 సంవత్సరం. తొలినాళ్లలో కరోనా ప్రభావం అంతగా లేని ఉమ్మడి వరంగల్​ జిల్లా .. అనంతరం అధిక సంఖ్యలో కేసులు వెలుగుచూశాయి.

ఉమ్మడి వరంగల్​నూ వణికించిన కరోనా.. వేల సంఖ్యలో బాధితులు
ఉమ్మడి వరంగల్​నూ వణికించిన కరోనా.. వేల సంఖ్యలో బాధితులు

By

Published : Jan 1, 2021, 6:55 PM IST

మొదట్లో ఉమ్మడి వరంగల్​ జిల్లాలో కరోనా వైరస్ ప్రభావం లేకపోయినా.. అనంతరం ఒక్కసారిగా వెలుగుచూసిన కేసులు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. అనతికాలంలోనే రెట్టింపయ్యాయి. తొలుత కేసులే లేని జిల్లాగా గుర్తింపు పొందిన వరంగల్​ గ్రామీణ జిల్లాలోనూ వైరస్​ విజృంభించింది. ఉమ్మడి జిల్లాల్లో .. 12,976 మంది కరోనా బారిన పడి.. వరంగల్​ అర్బన్​ జిల్లా తొలిస్థానంలో నిలిచింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 45 వేల మంది కొవిడ్​ బారినపడ్డారు. 260 మంది ప్రాణాలు కోల్పోయారు. అధికారులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది, ప్రజల సహకారంతో అదుపులోకి తీసుకువచ్చారు.

ములుగు వరంగల్ రూరల్ మహబూబాబాద్‌ భూపాలపల్లి జనగామ వరంగల్ అర్బన్
మొత్తం పరీక్షలు 64,796 92,699 1,94,000 37,870 1,14,659 3,56,025
పాజిటివ్ 5,096 6,462 12,633 3670 4689 12,976
యాక్టివ్​ కేసులు 215 203 195 53 119 358
ఆసుపత్రిలో చికిత్స 05 23 02 -- 20 38
హోం ఐసొలేషన్ 210 180 193 53 99 320
ర్యాపిడ్ యాంటిజెన్ 53,715 83,618 1,82,800 -- 1,10,773 3,44,575
ఆర్​ట్​పీసీఆర్​ 11,081 9,081 11,200 -- 3,886 11,450
మరణాలు 12 48 70 12 22 96

ప్రస్తుతానికి వైరస్​ వ్యాప్తి అదుపులో ఉన్నా.. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు. టీకా అందుబాటులోకి వచ్చేంత వరకు స్వీయ నిబంధనలే శరణ్యమని చెబుతున్నారు.

ఇవీచూడండి:రేపు రాష్ట్రంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ డ్రై రన్‌కు ఏర్పాట్లు

ABOUT THE AUTHOR

...view details