హన్మకొండలోని తేజస్వీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న పార్థివ్ ఈ నెల 7వ తేదీన చంద్రయాన్-2 వీక్షించేందుకు ఇస్రో బెంగళూర్ నుంచి ఆగస్టు 30న ఆహ్వానం అందుకున్నాడు. తెలంగాణ నుంచి ఇద్దరు విద్యార్థులు ఎంపిక కాగా అందులో పార్థివ్ ఒకరు. తమ పాఠశాల నుంచి ఎంపిక కావటం ఎంతో గర్వకారణమని పార్థివ్నుయాజమాన్యంఅభినందించింది. అతనితో పాటుగా తల్లికి కూడా చంద్రయాన్-2 చూసే అవకాశం దక్కింది.
మోదీతో చంద్రయాన్‌ను వీక్షించనున్న వరంగల్ విద్యార్థి - chandrayan-2-landing
ఇస్రో ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన ఆన్లైన్ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పార్థివ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 7న ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి బెంగళూరులోని ఇస్రో కార్యాలయంలో చంద్రయాన్ -2 లాండింగ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు ఇస్రో నుంచి ఆహ్వానం లభించింది.
మోదీతో చంద్రయాన్‌ను వీక్షించనున్న వరంగల్ విద్యార్థి