తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇప్పుడు భూముల క్రమబద్ధీకరణ సులభం: కలెక్టర్ హరిత - తెలంగాణ వార్తలు

అనధికారిక ప్లాట్లు, లేఅవుట్లను క్రమబద్ధీకరించుకునేందుకు జిల్లా ప్రజలు ముందుకు రావాలని కలెక్టర్ ఎం.హరిత కోరారు. పేద, మధ్య తరగతి వర్గాలపై ఆర్థిక భారం పడకుండా రిజిస్ట్రేషన్... నాటి మార్కెట్ విలువ ప్రకారంగానే క్రమబద్ధీకరణ చేసేలా జీవో 131ని ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు.

ఇప్పుడు భూముల క్రమబద్ధీకరణ సులభం: కలెక్టర్ హరిత
ఇప్పుడు భూముల క్రమబద్ధీకరణ సులభం: కలెక్టర్ హరిత

By

Published : Sep 28, 2020, 8:15 AM IST

ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో వరంగల్ గ్రామీణ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హరిత ఆదివారం మీడియాతో మాట్లాడారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇంతవరకు ఉన్న అనధికారిక ప్లాట్లు, లే అవుట్ల క్రమబద్ధీకరణకు ఇది మంచి అవకాశమని, అక్టోబర్ 15లోగా అందుబాటులో ఉన్న ఎల్​ఆర్​ఎస్ స్కీంను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. దరఖాస్తుదారులు క్రమబద్ధీకరణ ఫీజు 2021 జనవరి 31లోగా చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. క్రమబద్ధీకరణ లేని లేఅవుట్లలో భవిష్యత్తులో ఎలాంటి నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదని.. అంతేకాకుండా అమ్మడానికి, రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వీలుండదని కలెక్టర్ వివరించారు.

ప్లాట్లకు రిజిస్ట్రేషన్ రుసుము రూ.1000, లే అవుట్ రిజిస్ట్రేషన్ రుసుము రూ.10 వేలుగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రణాళికాబద్ధమైన సమీకృత అభివృద్ధికి ప్రభుత్వం రూపొందించిన జీవో 131 ఎంతో దోహదం చేస్తుందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:రుణాలు ఇస్తామని రైతులను మోసం చేసిన ఫైనాన్స్‌ సంస్థ

ABOUT THE AUTHOR

...view details