వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ టీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. కళాశాలలో తాగునీటి వసతి కల్పించాలని కోరారు.
శిథిలావస్థలో కళాశాల... భయం గుప్పిట్లో విద్యార్థులు - polytechnic college students protest in warangal
తమ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళనకు దిగారు.
వరంగల్లో విద్యార్థుల ధర్నా
తమ కళాశాలలో సాంకేతిక విద్యను అందించే ల్యాబ్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తరగతులు నిర్వహిస్తున్న క్రమంలో పెచ్చులూడి విద్యార్థులు గాయపడ్డారని వాపోయారు. ప్రభుత్వం స్పందించి వెంటనే తమ కళాశాల భవనాన్ని వేరే చోటుకు మార్చాలని లేకపోతే విద్యార్థుల ప్రాణాలకే ప్రమాదమని టీఎస్ఎఫ్ నాయకులు తెలిపారు.
- ఇదీ చూడండి: అమరావతిని మార్చకపోతే విప్లవం వస్తుంది:అవంతి
TAGGED:
వరంగల్లో విద్యార్థుల ధర్నా