తెలంగాణ

telangana

ETV Bharat / state

చెవిన పెట్టని ప్రజలు.. లాఠీ పట్టిన పోలీసులు - వరంగల్ కూరగాయల మార్కెట్‌

నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేందుకు వచ్చి నిబంధనల్ని ఉల్లంఘించిన నగరవాసులను వరంగల్‌ పోలీసులు లాఠీలతో చెదరగొట్టి దారికి తెచ్చే ప్రయత్నం చేశారు.

warangal police serious on customers and sellers in vegetable market warangal
చెవిన పెట్టని ప్రజలు.. లాఠీ పట్టిన పోలీసులు

By

Published : Mar 26, 2020, 11:44 AM IST

వరంగల్ కూరగాయల మార్కెట్‌లో లాక్‌డౌన్‌ నిబంధనల్ని పాటించని వారిపై పోలీసులు లాఠీ ఝులిపించారు. రహదారిపై కూరగాయలు అమ్ముతున్న వ్యాపారులకు జరిమానా విధించడమే కాక కూరగాయలను చెల్లాచెదురుగా పడేశారు. మార్కెట్‌లో పెరిగిన కూరగాయల ధరలను నియంత్రించే చర్యలు చేపట్టారు.

కరోనా నేపథ్యంలో మార్కెట్‌లో గుంపులు గుంపులుగా ఉండకూడదని, సామాజిక దూరం పాటించాలంటూ పోలీసులు పలుమార్లు మైక్‌లో విజ్ఞప్తి చేశారు. వ్యాపారులు, నగరవాసులు వినకపోవడం వల్ల పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సివచ్చింది. ఎవరినీ కొట్టకున్నా.. కాసేపు లాఠీలతో హడావుడి చేసి జనాన్ని దారిలోకి తెచ్చారు.

చెవిన పెట్టని ప్రజలు.. లాఠీ పట్టిన పోలీసులు

ఇదీ చూడండి:కరోనాపై భారతీయ పద్ధతుల్లో పోరాడితేనే ఫలితం

ABOUT THE AUTHOR

...view details