జూన్ 17 వ తేదీన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలను పోలీస్ ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. నగర సీపీ రవీందర్ ఆదేశాల మేరకు కేటీఆర్ సందర్శించే ప్రాంతాలను సెంట్రల్ జోన్ డీసీపీ మల్లారెడ్డి, ఓఎస్డీ తిరుపతి పరిశీలించారు. ముందుగా రాంపూర్‌లోని ఆక్సిజన్ పార్కు శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొననున్నట్లు తెలిపారు.
మంత్రి కేటీఆర్ పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు - మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటన
పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటనను పురస్కరించుకొని భద్రతాపరమైన చర్యలు చేపట్టినట్లు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు, అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా బందోబస్తు ప్రణాళికను రూపొందించినట్లు వెల్లడించారు.
మంత్రి కేటీఆర్ పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరం
అనంతరం కాజీపేట్, బాపూజీనగర్ కూడలిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. తర్వాత నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటారని పేర్కొన్నారు. శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగా ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు, అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా బందోబస్తు ప్రణాళికను తయారు చేస్తున్నట్టు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.