తెలంగాణ

telangana

ETV Bharat / state

నకిలీ ఎన్‌ఐఏ అధికారి ఆట కట్టించిన వరంగల్ పోలీసులు

Fake NIA officer arrested: ఆ యువకుడి వయస్సు 20 ఏళ్లే, అయినా నేరాలు చేయడంలో మహానేర్పరి. జల్సాలకు అలవాటు పడి ఎక్కువ డబ్బు సంపాదించాలన్న కోరికతో, నకిలీ ఎన్ఐఏ అధికారిగా అవతారం ఎత్తాడు. నిషేధిత పీఎఫ్ఐతో సంబంధాలున్నాయని పలువురిని బెదిరించి, బ్లాక్ మెయిల్‌కి దిగాడు. బాధితుల ఫిర్యాదుతో ఆ నకిలీ ఎన్​ఐఏ అధికారి గుట్టురట్టుచేశారు.

నకిలీ ఎన్‌ఐఏ అధికారినంటూ మోసాలు
Scams as a fake NIA officer

By

Published : Oct 18, 2022, 11:10 AM IST

నకిలీ ఎన్‌ఐఏ అధికారి ఆట కట్టించిన వరంగల్ పోలీసులు

Fake NIA officer arrested: నకిలీ ఎన్ఐఏ అధికారిఅవతారమెత్తి భయభ్రాంతులకు గురిచేస్తూ, డబ్బులు గుంజుతున్న 20 ఏళ్ల యువకుడిని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లగొండ జిల్లా అదిసర్లపల్లి మండలం, పోతిరెడ్డిపల్లికి చెందిన నార్లనరేష్ దూర విద్యలో డిగ్రీ చదువుతున్నాడు. జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలన్న కోరికతో నకిలీ ఆర్మీ, ఎన్​ఐఏ అధికారిగా మారాడు.

ఇందుకోసం ఆర్మీ వస్త్రాలతో పాటు, ఎయిర్‌పిస్తోల్ కొనుగోలు చేసి, నకిలీ గుర్తింపుకార్డు తయారు చేసుకున్నాడు. ఆర్మీలో పనిచేస్తున్నట్లుగా అందరినీ నమ్మించాడు. ఇటీవలే ఎన్​ఐఏ దేశంలో నిషేధిత పీఎఫ్ఐతో సంబంధం ఉన్న వ్యక్తుల ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించనట్లుగా వివిధ ప్రసార మాద్యమాల్లో ప్రచారం కావడంతో, అదే అదునుగా భావించి నకిలీ ఎన్ఐఏ అధికారిగా మారాడు.

కేయూ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇద్దరిని పీఎఫ్ఐతో సంబంధాలున్నాయని పిస్తోల్‌తో బెదిరించి డబ్బులు డిమాండ్‌ చేశాడు. డబ్బులు ఇవ్వకపోతే జైలుకు పంపిస్తానని బ్లాక్‌మెయిల్​కి దిగాడు. బాధితుల ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు నిఘా పెట్టగా, కేయూ వద్ద నిందితుడు పోలీసులకు చిక్కాడు. గతంలో జగిత్యాల జిల్లాలోను ఇదే తరహాలో నేరాలకు పాల్పడినట్లుగా దర్యాప్తులో తేలింది.

నిందితుడు వద్ద నుంచి ఆర్మీ యూనిఫాం, ల్యాప్‌టాప్, నకిలీ గుర్తింపు కార్డు, ఎయిర్ రైఫిల్, రెండు ద్విచక్రవాహనాలు, సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేయూ పరిధిలో ఓ ద్విచక్రవాహన దారుడిని బెదిరించి 20 గ్రాముల బంగారు గొలుసు, రూ.3.600 నగదు, బైక్‌ని అపహరించిన మరోఇద్దర్ని పోలీసులు అరెస్టు చేశారు.

అంతకుముందు పలువురు యువకులకు నేవీలో ఉద్యోగాలిప్పిస్తానంటూ రూ.5లక్షలు వసూలు చేసి మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు కమిషనర్ తరుణ్ జోషీ తెలిపారు. అధికార్లమని మోసాలు వివిధ ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలిప్పిస్తానంటూ, డబ్బులు వసూలు చేసే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.

వరంగల్​ జిల్లాలో కేయూసీ లిమిట్స్​లో రెండు కేసులు నమోదయ్యాయి. ఈ రెండు ఒకే విధమైన కేసులు. ఊరిలో సర్పంచ్​తో సహా అందరికి పీఎఫ్ఐలో వర్క్ చేస్తున్నమని వారు నమ్మించారు. -తరుణ్ జోషీ, సీపీ వరంగల్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details