లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపట్ల వరంగల్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో 1,100 వాహనాలను సీజ్ చేసిన అధికారులు... 150కి పైగా కేసులు నమోదు చేశారు. మరికొందరికి జరిమానాలు విధించారు.
నిబంధనలు ఖాతరు చేయకపోతే కఠిన చర్యలు - corona news in warangal
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై వరంగల్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లపై దృష్టిసారించిన పోలీసులు అనవసరంగా రోడ్డెక్కిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.
నిబంధనలు ఖాతరు చేయకపోతే కఠిన చర్యలు
వరంగల్ నగరంలో కరోనా వైరస్ కేసులు నమోదు కావడం వల్ల నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ప్రజలు సహకరించాలని కోరుతున్నారు. ఎవరైనా పెడచెవిన పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చూడండి:అపరిచిత వైరస్‌తో అపూర్వ పోరు!