తెలంగాణ

telangana

ETV Bharat / state

మంత్రులను కలిసిన వరంగల్ నూతన సీపీ తరుణ్ జోషి - వరంగల్ నూతన కమిషనర్ తరుణ్ జోషి

వరంగల్ నూతన పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి.. రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరిని మర్యాదపూర్వకంగా కలిశారు. హన్మకొండలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రులను కలిసి పుష్ప గుచ్ఛం అందచేశారు.

wgl
wgl ministers

By

Published : Apr 9, 2021, 5:26 PM IST

రాష్ట్రమంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరిని వరంగల్ నూతన పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి మర్యాద పూర్వకంగా కలిశారు. హన్మకొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కలిసిన సీపీ పుష్పగుచ్ఛాలను అందజేశారు.

కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతలు, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించాలని మంత్రులు సూచించారు. గతంలో ఇక్కడ పనిచేసినా అనుభవం ఉపయోగపడుతుందని ఎర్రబెల్లి అన్నారు. నగర ప్రజలకు సేవలందించి మంచి పేరు తెచ్చుకోవాలని నూతన సీపీ తరుణ్ జోషికి మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు

ఇదీ చూడండి:రాష్ట్రానికి మరో టెక్స్‌టైల్ కంపెనీ.. 1100 మందికి ప్రత్యక్ష ఉపాధి

ABOUT THE AUTHOR

...view details