తెలంగాణ

telangana

By

Published : Sep 19, 2020, 9:05 AM IST

ETV Bharat / state

గజం రూ.50 వేలకుపైగా ఉంటే వందశాతం చార్జీలు : వరంగల్ నగర పాలిక

లే అవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం జారీ చేసిన ల్యాండ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్‌) జీఓ నెంబర్‌ 131కి ప్రభుత్వం సవరణలు చేపట్టింది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ల కోసం నూతన రుసుంలను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండా ప్రకాశ్​రావు వెల్లడించారు.

ఎల్​ఆర్​ఎస్​ ధరల బ్రోచర్​ను విడుదల చేసిన వరంగల్ నగర పాలిక
ఎల్​ఆర్​ఎస్​ ధరల బ్రోచర్​ను విడుదల చేసిన వరంగల్ నగర పాలిక

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి​లో ఎల్​ఆర్ఎస్ బ్రోచర్​ని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, నగర మేయర్ గుండా ప్రకాశ్​రావుతో కలిసి విడుదల చేశారు. 2015 నాటి ఎల్‌ఆర్‌ఎస్‌ స్లాబ్‌లతో క్రమబద్ధీకరణ రుసుంను వసూలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించినట్లు వరంగల్ మేయర్ ప్రకాశ్​రావు తెలిపారు.

జీఓ 131 ఆధారంగా..

అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణకు సర్కార్ జారీచేసిన ఎల్‌ఆర్‌ఎస్‌ జీఓ నెంబర్‌ 131 ఆధారంగా అల్పాదాయ వర్గాలపై ఆర్థిక భారం మోపమని ఆయన పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్‌ నాటి మార్కెట్‌ విలువ ఆధారంగానే జీఓను ప్రభుత్వం సవరించనున్నట్లు ప్రకటించారు.

అలా ఉంటే 100 శాతం ఛార్జీలు..

చదరపు గజం మార్కెట్‌ ధర రూ. 3 వేల వరకు ఉంటే 20 శాతం , రూ.3,001 నుంచి రూ. 5 వేల వరకు 30 శాతం ,రూ. 5001 నుంచి రూ. 10 వేల వరకు 40 శాతం, రూ. 10,001 నుంచి రూ. 20 వేల వరకు 50 శాతం, రూ. 20,001 నుంచి రూ. 30 వేల వరకు 60 శాతం, రూ. 30,001 నుంచి రూ. 50 వేల వరకు 80 శాతం, రూ. 50 వేలకు పైగా మార్కెట్‌ ధర ఉంటే వందశాతం చార్జీలను వసూలు చేస్తామని తెలిపారు.

ఇవీ చూడండి : చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు

ABOUT THE AUTHOR

...view details