వరంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి. ఆయా పార్టీల నేతలు తమదైన శైలిలో ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. 20వ డివిజన్లో జనసేన అభ్యర్థి రాజు ప్రచారం కొనసాగించారు. చదువుకున్న యువతను ఎన్నుకుంటే డివిజన్ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని ప్రజలకు సూచించారు.
'యువతకు స్థానం కల్పిస్తేనే రాజకీయాల్లో మార్పు' - warangal election news
వరంగల్ బల్దియా ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. 20వ డివిజన్లో జనసేన అభ్యర్థి రాజు ప్రచారం నిర్వహించారు. చదువుకున్న యువతను ఎన్నుకోవాలని ప్రజలను కోరారు.
janasena,warangal municipal election, election campaign
కొన్ని పార్టీలు పేకాటరాయుళ్లకు, కబ్జాదారులకు టికెట్లు ఇచ్చాయని.. డబ్బు, అధికార బలంతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. యువతకు స్థానం కల్పిస్తే రాజకీయాల్లో మార్పు కనిపిస్తుందని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో ఆంబులెన్స్కు 10రెట్లు పెరిగిన డిమాండ్