వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారులు పన్ను బకాయిలు కట్టనివారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఆస్తి, నీటి పన్నులు చెల్లించనివారిని గుర్తించి... వారి పేర్లను వరంగల్ మహా నగర పాలక సంస్థ కార్యాలయం, నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద ప్రకటన బోర్డులపై ఉండేలా ఏర్పాట్లు చేశారు.
పన్ను చెల్లించకుంటే ప్రకటన బోర్డుల్లో పేర్లు - వరంగల్ మహా నగర పాలక సంస్థ కార్యాలయం
పన్నులు చెల్లించనివారి కోసం వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. పన్నుబకాయిలు చెల్లించనివారి వివరాలతో కూడిన ప్రకటన బోర్డులను నగరంలో ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేశారు.

పన్ను చెల్లించకుంటే... పేర్లు ప్రకటన బోర్డుల్లో
పెద్ద మొత్తంలో పన్ను బాకాయిలు చెల్లించాల్సిన వారి పేర్లతో పాటు వారి ఇంటి నంబర్లతో కూడిన ప్రకటన బోర్డులు రూపొందించి వరంగల్ హన్మకొండ ప్రధాన రహదారి మధ్యలో వాటిని ఏర్పాటు చేశారు.
పన్ను చెల్లించకుంటే... పేర్లు ప్రకటన బోర్డుల్లో
ఇదీ చూడండి:జర భద్రం.. జోలికొస్తే మట్టి కరిపిస్తాం..!