వరంగల్ మహా నగర పాలక సంస్థ కార్యాలయంలో మొదటిసారిగా టెలీ కాన్ఫరెన్స్ ద్వారా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కరోనా వైరస్ ప్రభావం కారణంగా తొలిసారిగా టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్టు మేయర్ గుండా ప్రకాశ్ తెలిపారు. ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో వరంగల్ మహా నగర పాలక సంస్థ కార్యాలయంలోని వివిధ విభాగాల అధికారులతో పాటు కార్పొరేటర్లు పాల్గొన్నారు.
టెలీ కాన్ఫరెన్స్ ద్వారా బల్దియా బడ్జెట్‌కు ఆమోదం - బల్దియా బడ్జెట్
నూతన పురపాలక చట్టానికి అనుగుణంగా వరంగల్ మహనగర పాలక వర్గం 2020-21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొదటిసారిగా టెలీ కాన్ఫరెన్స్ ద్వారా బడ్జెట్‌ను ఆమెదించినట్లు మేయర్ గుండా ప్రకాశ్ తెలిపారు.

టెలీ కాన్ఫరెన్స్ ద్వారా బల్దియా బడ్జెట్‌కు ఆమోదం
సుదీర్ఘ చర్చ అనంతరం బడ్జెట్‌ను సభ్యులు ఆమోదించినట్లు మేయర్ వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాలనుసారం అత్యవసర పరిస్థితుల్లో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా బడ్జెట్‌ను ప్రవేశ పెట్టామని ఆయన తెలిపారు.