తెలంగాణ

telangana

చెత్త సేకరించేందుకు.. ప్రజలు సహకరించాలి : వరంగల్​ కమిషనర్

ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించేందుకు ప్రజలు సహకరించాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పమేలా సత్పతి కోరారు. హన్మకొండలోని బాలసముద్రంలో గల కమిషనర్​ క్యాంప్ కార్యాలయంలో ఉన్న చెత్తను ఆమె స్వయంగా తీసి.. స్వచ్ఛ ఆటోలో వేశారు. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్త వేర్వేరు డబ్బాల్లో సేకరించి స్వచ్ఛ ఆటోలలో మాత్రమే తరలించాలని ఆదేశించారు.

By

Published : Sep 22, 2020, 12:40 PM IST

Published : Sep 22, 2020, 12:40 PM IST

Warangal Municipal Commissioner calls for swatch warangal city
చెత్త సేకరించేందుకు.. ప్రజలు సహకరించాలి : వరంగల్​ కమిషనర్

ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ విధిగా జరగాలని.. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి.. స్వచ్ఛ ఆటోల్లో మాత్రమే తరలించాలని గ్రేటర్​ వరంగల్​ మున్సిపల్​ కార్పొరేషన్​ కమిషనర్​ పమేలా సత్పతి కోరారు. బాలసముద్రంలోని కమిషనర్​ క్యాంపు కార్యాలయంలోని చెత్తను ఆమె స్వయంగా తీసి స్వచ్ఛ ఆటోలో వేశారు.

చెత్తను సేకరించేందుకు ప్రతి 500 ఇళ్లకు ఒక స్వచ్ఛ ఆటో చొప్పున గ్రేటర్ వరంగల్​ పరిధిలో 164 చెత్త తరలించే ఆటోలను అందుబాటులో ఉంచామని అన్నారు. కార్పొరేషన్ నుండి స్వచ్ఛ ఆటోడ్రైవర్లకు ఎలాంటి భత్యాలు చెల్లించడం లేదని, ప్రతి ఇంటి నుండి చెత్త తీసుకొని వెళ్లినందుకు గానూ స్వచ్ఛ ఆటోడ్రైవర్లకు ప్రతినెల ఇంటికి 60 రూపాయలు తప్పనిసరిగా చెల్లించాలని నగర ప్రజలను కమిషనర్​ కోరారు.

ఇదీ చదవండి:నూతన విద్యా విధానంతో భారత్​కు విశ్వగురువు స్థానం: గవర్నర్

ABOUT THE AUTHOR

...view details