తెలంగాణ

telangana

ETV Bharat / state

సామాన్యుల నడ్డి విరుస్తున్న ఇంధన ధరలు - ఇంధన ధరల పెరుగుదల పట్ల వరంగల్‌లో వాహనదారుల ఆందోళన

వారం రోజుల వ్యవధిలో నాలుగు సార్లు ఇంధన ధరలు పెంచడం దారుణమని వరంగల్‌లో వాహనదారులు వాపోతున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఆదాయం కోల్పోయిన తమకు ప్రస్తుత ధరలు మరింత భారంగా మారాయని తెలిపారు. ఇకనైనా సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారాన్ని తగ్గించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Motorists in Warangal worried about rising fuel prices
ఇంధన ధరల పెరుగుదల పట్ల వరంగల్‌లో వాహనదారుల మండిపాటు

By

Published : Jun 7, 2021, 5:33 PM IST

వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలపట్ల వరంగల్‌లో వాహనదారులు మండిపడుతున్నారు. తాజాగా పెరిగిన ధరలతో నగరంలో లీటర్ పెట్రోల్ ధర 98.60 రూపాయలు, పవర్ పెట్రోల్ ధర 103.12 రూపాయలకు చేరుకుంది. లీటర్ డీజిల్ ధర 93.16 రూపాయలకు ఎగబాకింది.

లాక్‌డౌన్ కారణంగా ఆదాయం కోల్పోయి ఇబ్బందులు పడుతున్నామన్న వాహనదారులు.. వారం రోజుల్లో వరుసగా నాలుగు సార్లు ఇంధన ధరలు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారాన్ని తగ్గించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

ఇంధన ధరల పెరుగుదల పట్ల వరంగల్‌లో వాహనదారుల మండిపాటు

ఇదీ చదవండి:Bandi Sanjay : 'రాష్ట్ర రాజకీయాల్లో సంచలన మార్పులు'

ABOUT THE AUTHOR

...view details