వరంగల్ నగరాన్ని ఉత్తమ పర్యాటక ప్రదేశంగా తీర్చి దిద్దుతామని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఆయన హన్మకొండలోని పలు పర్యాటక ప్రదేశాలను సందర్శించారు.
‘నగరాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతాం’ - పద్మాక్షి గుట్ట
వరంగల్ నగరాన్ని మంచి పర్యాటక ప్రదేశంగా తీర్చి దిద్దుతామని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా హన్మకొండలోని పద్మాక్షి గుట్ట, జైనుల గుట్టను ఆయన సందర్శించారు. దశల వారీగా వరంగల్ పట్టణాన్ని పూర్తి పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేస్తామని అన్నారు.
‘నగరాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతాం’
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే రాష్ట్రంలోని పర్యాటక క్షేత్రాలను గుర్తించి అభివృద్ధి చేశామని.. వరంగల్ నగరాన్ని కూడా ఉత్తమ పర్యాటక ప్రాంతంగా తీర్చి దిద్దుతామని.. ఇప్పపటికే దశల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. జైనుల గుట్ట అభివృద్ధికి కోటి రూపాయలు కేటాయించి.. చారిత్రక పర్యాటక ప్రాంతంగా తీర్చి దిద్దుతామని ఆయన స్పష్టం చేశారు.