తెలంగాణ

telangana

ETV Bharat / state

వరంగల్ ఎంజీఎంలో నిర్లక్ష్యం... ఆరుబయటే రోగుల తిప్పలు

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి చిరునామాగా నిలుస్తున్నారు. ఆస్పత్రిలో చేరేందుకు వచ్చిన రోగులను పట్టించుకోవడం లేదు. ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో రాగా.. ఐదు గంటలుగా ఆరుబయటే ఉంచారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఇలా వ్యవహరించడమేంటని బాధితులు వాపోతున్నారు.

Warangal MGM Hospital
వరంగల్ ఎంజీఎంలో చెట్ల కిందే రోగుల పడిగాపులు

By

Published : Apr 9, 2021, 5:52 PM IST

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి వచ్చిన రోగుల పట్ల కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నారు వైద్య సిబ్బంది. హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి కరోనా వ్యాధి లక్షణాలు కనిపించడంతో ఎంజీఎంకు రాగా.. ఐదు గంటలుగా ఆరుబయటే ఉంచారు. రోగులను అడ్మిట్ చేసుకునేందుకు సాకులు చెబుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కరోనా లక్షణాలతో ఆస్పత్రికి వచ్చినా... ఏమి చేయాలో తెలియక రోగి బంధువులు కొవిడ్ విభాగం వద్ద నిస్సహాయులుగా ఉండిపోయారు. ఓపీ విషయంపై ఆస్పత్రి కార్యనిర్వహణ అధికారిని వివరణ కోరగా... స్పందించిన సూపరింటెండెంట్ నాగార్జున రెడ్డి వెంటనే అడ్మిట్ చేసుకుని చికిత్సను అందించారు.

ఇదీ చూడండి:జీహెచ్ఎంసీ సిబ్బందికి 100 శాతం వ్యాక్సినేషన్‌

ABOUT THE AUTHOR

...view details