మహిళా సాధికారతకు కృషి చేస్తున్నట్లు వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్‌రావు తెలిపారు. బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాలులో కార్పొరేషన్, మెప్మా సంయుక్త ఆధ్వర్యంలో యుఎంసీ, ఆస్కి నేతృత్వంలో ఒకరోజు వర్క్‌షాప్‌ను మేయర్ ప్రారంభించారు. మహిళలకు చేయూతను అందించాలనే ఉద్దేశంతో మహిళా సంఘాలను భాగస్వామ్యం చేస్తూ మరుగుదొడ్ల నిర్వహణలో, నిర్మాణంలో వారికి శిక్షణను అందజేస్తున్నామన్నారు.
బల్దియాలో మహిళా సాధికారతకు పెద్దపీట: మేయర్ ప్రకాశ్‌రావు - వరంగల్ జిల్లా వార్తలు
మహిళలకు చేయూత అందించాలనే ఉద్దేశంతో మరుగుదొడ్ల నిర్వహణ, నిర్మాణంలో మహిళ సంఘాలను భాగస్వామ్యం చేస్తున్నట్లు వరంగల్ నగర మేయర్ ప్రకాశ్‌రావు తెలిపారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో ఒకరోజు వర్క్‌షాప్‌ను ఆయన ప్రారంభించారు.
ఇటీవల సీకేఎం జంక్షన్, ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియం ప్రాంతాల్లో నిర్మించనున్న మరుగుదొడ్ల నిర్మాణాలకు బిడ్ దాఖలు చేశామని మేయర్ తెలిపారు. ప్రతి వెయ్యి మందికి ఒక మరుగుదొడ్డి ఉండాలన్న నిబంధనలు ఉన్నాయని, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా నగరంలో పలు ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలను ఆగస్టు 15లోగా పూర్తి చేస్తామని తెలిపారు. మరుగుదొడ్ల నిర్వహణ మహిళా సంఘాలకు చెందిన మహిళలకు అప్పగిస్తున్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి: 'మహిళల అవస్థ గుర్తించాం.. ఆగస్టు 14లోపు నిర్మాణాలు పూర్తిచేస్తాం'