పరిశుభ్రతను పాటించి.. సీజనల్ వ్యాధులను తరిమికొడదామని వరంగల్ మహా నగర పాలక సంస్థ మేయర్ గుండా ప్రకాష్ పిలుపునిచ్చారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు నగరంలోని పలు కాలనీలలో ఆయన పర్యటించారు. నగరంలోని 26వ డివిజన్లోని పలు కాలనీల్లో ఆయన పర్యటించి ఇంటి ముంగిళ్లతో పాటు కాలనీని పరిశుభ్రంగా ఉంచాలని కాలనీవాసులకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.
నగరంలోని పలు కాలనీల్లో పర్యటించిన మేయర్ - gwmc mayor
వరంగల్ నగరంలోని 26వ డివిజన్లో గల పలు కాలనీల్లో మహా నగర పాలక సంస్థ మేయర్ గుండా ప్రకాష్ పర్యటించారు. పరిశుభ్రతను పాటించి సీజనల్ వ్యాధులను తరిమికొట్టాలని నగరవాసులకు మేయర్ సూచించారు.

నగరంలోని పలు కాలనీల్లో పర్యటించిన మేయర్
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా, ఇంట్లో నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని ఆయన నగరవాసులకు వివరించారు. సీజనల్ వ్యాధులు అరికట్టేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారని, అయినప్పటికీ వ్యక్తిగత శుభ్రత, ఇంటి శుభ్రతతోనే వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: ఈ ఆదివారం 10 నిమిషాల్లో.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎం చేశారంటే?