తెలంగాణ

telangana

By

Published : May 5, 2020, 10:10 PM IST

ETV Bharat / state

వరంగల్​లో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి: మేయర్​

వరంగల్​ మేయర్​ గుండా ప్రకాష్​ బల్దియా అధికారులతో సమీక్ష నిర్వహించారు. వేసవి ప్రారంభమైన నేపథ్యంలో వరంగల్​ మహానగరంలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

warangal mayor gunda prakash review meeting on water supply
వరంగల్​లో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి: మేయర్​

వరంగల్ మహానగరంలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని నగరపాలక సంస్థ మేయర్ గుండా ప్రకాష్ అధికారులకు సూచించారు. వేసవికాలం ప్రారంభమైన నేపథ్యంలో మేయర్ బల్దియా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు వరంగల్ మహానగరానికి తాగునీటిని అందించే భద్రకాళి జలాశయం, వడ్డేపల్లి జలాశయం, ధర్మసాగర్ జలాశయాల్లోని నీటి నిల్వలను అడిగి తెలుసుకున్నారు. గ్రేటర్ పరిధిలోని 58 డివిజన్లలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రతి డివిజన్ కి రెండు లక్షల రూపాయలను కేటాయిస్తామని.. పైపులైను లేని డివిజన్లలో, కాలనీలలో అద్దె ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details