పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వరంగల్ మహా నగరపాలక సంస్థ ప్రత్యేక కార్యచరణ చేపట్టింది. స్వచ్ఛ సర్వేక్షణ్ పేరిట నగరవాసులను చైతన్య పరిచేందుకు.. హన్మకొండలోని వేయి స్తంభాల ఆలయం నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని నగర మేయర్ గుండా ప్రకాష్, కమిషనర్ పమేలా సత్పతి.. అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు జెండా ఊపి ప్రారంభించారు. నగరపాలక సంస్థ సిబ్బంది సహితం ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
'సుందర నగరమే మా ధ్వేయం.. అందరూ కలసి రావాలి' - telangana news
పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వరంగల్ మహా నగరపాలక సంస్థ ప్రత్యేక కార్యచరణ చేపట్టింది. స్వచ్ఛ సర్వేక్షణ్ పేరిట నగరవాసులను చైతన్య పరిచేందుకు... హన్మకొండలోని వేయి స్తంభాల ఆలయం నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు ర్యాలీని నిర్వహించారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని మేయర్ గుండా ప్రకాష్ తెలిపారు.
స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాలీ
వరంగల్ నగరాన్ని పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని మేయర్ తెలిపారు. చెత్త తరలించేందుకు నగరవాసులు తమ వంతు సహకారన్ని అందించాలని సూచించారు. ఆస్తి పన్నులోనే చెత్త పన్ను విధించే విధంగా ఇటీవలే కౌన్సిల్ తీర్మానం చేశామని గుండా ప్రకాష్ తెలిపారు.
ఇదీ చదవండి:పామును పట్టాడు... మెడలో వేశాడు..