కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు వరంగల్ మహా నగర పాలక సంస్థ నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. నగరపాలక సంస్థ పరిధిలోని 58 డివిజన్లలో ఇంటికి రెండు మాస్క్‌ల చొప్పున అందించాలని నగర మేయర్ గుండా ప్రకాష్ అధికారులకు సూచించారు.
వరంగల్ నగర ప్రజలకు 6లక్షల మాస్క్‌ల పంపిణీ - Warangal Mayor Distribution 6 Lacks Masks for people
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణా చర్యల్లో భాగంగా ప్రజలు మాస్క్‌లు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని 58 డివిజన్లలో మాస్క్‌లు పంపిణీ చేయాలని నగర మేయర్ గుండా ప్రకాశ్ ఆదేశించారు.
![వరంగల్ నగర ప్రజలకు 6లక్షల మాస్క్‌ల పంపిణీ Warangal Mayor Distribution 6 Lacks Masks for people](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6755270-718-6755270-1586617727834.jpg)
వరంగల్ నగర ప్రజలకు 6లక్షల మాస్క్‌ల పంపిణీ
వివిధ స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాల సమన్వయంతో మాస్కులను పంపిణీ చేయాలని కమిషనర్‌కు సూచించారు. ముందుగా విలీన గ్రామాలలో, మురికివాడలలో మాస్కులను పంపిణీ చేస్తామని తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో, రహదారులపై ఉమ్మి వేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య సిబ్బంది చేస్తున్న సేవలు వెలకట్టలేనివని ఆయన కొనియాడారు.