వరంగల్ అర్బన్ జిల్లా హసన్ పర్తి మండలం వంగపహాడ్, పెగడపల్లిలో వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆకస్మిక పర్యటన చేశారు. విలీన గ్రామాల్లోని డివిజన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను బల్దియా అధికారులతో కలిసి పరిశీలించారు.
ద్విచక్రవాహనంపై మేయర్, ఎమ్మెల్యే ఆకస్మిక పర్యటన - వరంగల్ మేయర్ ప్రకాశ్ తాజా వార్తలు
వరంగల్ అర్బన్ జిల్లా హసన్ పర్తి మండలం వంగపహాడ్, పెగడపల్లిలో వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆకస్మిక పర్యటన చేశారు. గల్లీల్లో ద్విచక్రవాహనంపై తిరుగుతూ డ్రైనేజీలు, సీసీ రోడ్లు, శ్మశానవాటిక, ప్రకృతి వనాలను పరిశీలించారు.
ద్విచక్రవాహనంపై మేయర్, ఎమ్మెల్యే ఆకస్మిక పర్యటన
గల్లీల్లో ద్విచక్రవాహనంపై వరంగల్ మేయర్ ప్రకాశ్ రావు, ఎమ్మెల్యే రమేశ్ తిరుగుతూ డ్రైనేజీలు, సీసీ రోడ్లు, శ్మశానవాటిక, ప్రకృతి వనాలను పరిశీలించారు. పెండింగ్ పనులను త్వరతిగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. హసన్ పర్తి మండలానికి మరిన్ని నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని మేయర్, ఎమ్మెల్యే తెలిపారు. విలీన గ్రామాలను నగరాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:బయట పడ్డ నకిలీ బాగోతం.. క్రిమినల్ చర్యలకు కలెక్టర్ ఆదేశం!