Warangal KU Bandh Updates కొనసాగుతోన్న వరంగల్ బంద్ కేయూ వద్ద భారీగా పోలీసుల మోహరింపు Warangal KU Bandh Updates :వరంగల్ కాకతీయ విశ్వ విద్యాలయంలో పీహెచ్‌డీ ప్రవేశాల్లో అవకతవకలు జరిగాయంటూ విద్యార్థి ఐకాస పిలుపు మేరకు వరంగల్ జిల్లా బంద్ కొనసాగుతోంది. విద్యార్థుల నిరసనకు బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు వివిధ పార్టీలు, సంఘాలు మద్దతు తెలిపాయి. పీహెచ్‌డీ ప్రవేశాల్లో అవినీతి జరిగిందంటూ గత వారం విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగడం, పోలీసులు వారిని అడ్డుకోగా.. వర్సిటీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ సందర్భంలోనే పోలీసులు టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తీసుకెళ్లి.. తమను కొట్టారంటూ 6 రోజులుగా విద్యార్థులు నిరసన దీక్షలు చేపట్టారు.
Warangal KU Bandh Today : పీహెచ్‌డీ ప్రవేశాల రగడ.. నేడు కేయూ సహా వరంగల్ జిల్లా బంద్
Heavy Police Protection at Warangal KU: ఈ నేపథ్యంలోనే విద్యార్థి ఐకాస.. వర్సిటీతో పాటు వరంగల్ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్ దృష్ట్యా కాకతీయ వర్సిటీ వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బంద్‌లో భాగంగా కాకతీయ విశ్వ విద్యాలయం నుంచి విద్యార్థి సంఘాలు బైక్ ర్యాలీ చేపట్టగా.. కేయూ దూర విద్య కేంద్రం వద్ద విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది.
స్వచ్ఛందంగా బంద్ పాటింపు..: బంద్ కారణంగా నగరంలోని పలు ప్రైవేట్ విద్యా సంస్థలు ముందుగానే సెలవు ప్రకటించాయి. పలు ప్రైవేట్ కళాశాలల బస్సులను విద్యార్థి సంఘాల నేతలు అడ్డుకున్నారు. బస్సుల నుంచి విద్యార్థులను దించేసి.. బంద్‌కు సహకరించాలని కోరారు. ఇదిలా ఉంటే.. కాకతీయ విశ్వవిద్యాలయం పరిసరాల్లో బంద్ సంపూర్ణంగా కనిపిస్తుంది. వర్తక, వాణిజ్య సముదాయాలను వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేసి.. బంద్‌లో భాగస్వాములవుతున్నారు.
కేయూలో సభకు నిరాకరించిన వీసీ.. భగ్గుమన్న విద్యార్థి సంఘాలు
ఆ కేసులన్నీ ఉపసంహరించుకోవాలి..: ఇదిలా ఉండగా.. పీహెచ్‌డీ కేటగిరి-2లో జరిగిన అక్రమాలపై ప్రశ్నించిన విద్యార్థులపై పెట్టిన కేసులన్నింటినీ ఉప సంహరించుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పీహెచ్‌డీ కేటగిరి-2లో ఇప్పుడున్న అన్ని విభాగాల్లో ఖాళీలను గుర్తించి మెరిట్ ప్రకారం రెండో జాబితా ప్రకటించి అడ్మిషన్లు జరపాలని, విద్యార్థులపై వ్యతిరేక విధానం అవలంభిస్తున్న ఆంధ్ర రిజిస్ట్రార్‌ను తక్షణమే తొలగించాలని, పెంచిన పీహెచ్‌డీతో పాటు మిగతా కోర్సుల ఫీజులన్నింటీ తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. క్యాంపస్‌లో విద్యార్థులపై భౌతిక దాడులు చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని పట్టుబడుతున్నారు.
పనిచేయని ప్రింటర్.. వాట్సప్‌లో ప్రశ్నాపత్రం పంపి ఎగ్జామ్ రాయించిన ప్రిన్సిపల్
అసలు ఏం జరిగిందంటే..?: కేయూలో పీహెచ్‌డీ కేటగిరి-2 ప్రవేశాల్లో అక్రమాలు జరిగాయని విద్యార్థులు చేపట్టిన ఆందోళన.. తదనంతర పరిణామాలు ఉద్రిక్తతలకు దారి తీసింది. ప్రవేశాలు రద్దు చేయాలంటూ విద్యార్థులు ప్రిన్సిపల్ కార్యాలయంలోకి చొచ్చుకుపోగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య జరిగిన తోపులాటలో విద్యార్థులకు గాయాలయ్యాయి. కార్యాలయ ఫర్నీచర్ ధ్వంసమైంది.
కస్టడీ సమయంలో పోలీసులు విచక్షణా రహితంగా కొట్టారని విద్యార్థులు ఆరోపించారు. పోలీసుల దాడిని నిరసిస్తూ 12 విద్యార్థి సంఘాలు.. కాకతీయ విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం ఎదుట దీక్షకు దిగాయి. దీనికి రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. దాడిని నిరసిస్తూ నేడు జిల్లా బంద్‌కు విద్యార్థి ఐకాస పిలుపునిచ్చింది.
Warangal CP on Allegations Police Beating to KU Students : కేయూ విద్యార్థులను పోలీసులు తీవ్రంగా కొట్టారనేది అవాస్తవం : సీపీ రంగనాథ్