తెలంగాణ

telangana

ETV Bharat / state

Warangal Khammam Highway Accidents : ఈ హైవే వైపు వెళ్తున్నారా.. బీ కేర్​ఫుల్ బ్రో..!

Warangal Khammam Highway Accidents : జాతీయ రహదారి-563 ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. ఆచితూచి ప్రయాణం చేసినప్పటికీ ఆపదలు తప్పట్లేదు. గత మూడు వారాలుగా వరంగల్‌-ఖమ్మం జాతీయ రహదారిపై ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డుపై ఏర్పడిన గుంతలు, మలుపుల వద్ద సూచికలు లేకపోవటంతో ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారుల్లో ఏ మాత్రం చలనం లేకపోవటంపై స్థానికులు భగ్గుమంటున్నారు. నిర్వహణ లోపం కారణంగా జాతీయ రహదారిపై ప్రమాదాలు నిత్యకృత్యమైన తీరుపై ఈటీవీ భారత్​ కథనం.

Warangal Khammam Highway
Lot Accidents Taking place in Warangal Khammam Highway

By ETV Bharat Telangana Team

Published : Sep 2, 2023, 8:06 AM IST

Updated : Sep 2, 2023, 12:04 PM IST

Warangal Khammam Highway Accidents ఈ హైవే వైపు వెళ్తున్నారా.. బీ కేర్​ఫుల్ బ్రో..

Warangal Khammam Highway Accidents :వరంగల్​-ఖమ్మం జాతీయ రహదారిపై వాహనాలునడిపేందుకు ప్రయాణికులు జంకుతున్నారు. అందుకు కారణం రోడ్లపై ఏర్పడిన గుంతలు, మూల మలుపుల వద్ద లేని సూచిక బోర్డులు. ఈ రహదారిపై ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటున్నారు స్థానికులు. రోడ్ల(Telangana Roads Damage) మరమ్మతుల కోసం ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి టోల్​ప్లాజా ద్వారా డబ్బులు కలెక్ట్ చేస్తుంది. దాని ద్వారా వచ్చిన డబ్బులను జాతీయ రహదారుల నిర్మాణానికి లేక వాటి మరమ్మతుల కోసం ఉపయోగిస్తుంటుంది. ఈ విషయంలో ప్రజలు వెళ్లి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

Cutting of Trees on National Highway 563 : రహదారి విస్తరణ.. వృక్షాలకు మరణదండన..

NH 563 As Accident Zone : ఇది వరంగల్‌-ఖమ్మం జాతీయ రహదారి 563. పేరుకు.. నేషనల్‌ హైవే(National Highways Telangana) అయినా ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పోవాల్సి వస్తోంది. రోడ్డు పొడవునా ఏర్పడిన గుంతలు, మూల మలుపులను సూచించే బోర్డులు లేకపోవటంతో ప్రమాదాలు నిత్యకృత్యమవుతున్నాయి. వేగంగా వచ్చే వాహనాల ధాటికి కొందరు అక్కడే మృతి చెందుతుండగా మరికొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రుల పాలవుతున్నారు. నేషనల్‌ హైవే అథారిటీ అధికారుల పర్యవేక్షణ లోపం ప్రమాదాలకు మూల కారణమౌతోంది. రోడ్డుపై ఏర్పడిన గుంతల కారణంగా రాత్రి వేళ ప్రయాణం కష్టమైపోతోంది.

"ఇక్కడ రోజులో కనీసం ఒక ప్రమాదమైనా జరుగుతుంది. ప్రజలు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఈ రోడ్డు పైకి రావాల్సి వస్తుంది. పశువులు కూడా ప్రమాదాలకు గురవుతున్నాయి. రోడ్డు ప్రమాదంలో ఇంత మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్న ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. రోడ్డు టాక్స్​ అంటూ ప్రజల దగ్గర సొమ్ము తీసుకుంటున్నారు కానీ రోడ్డు మాత్రం మరమ్మతు చేయడం లేదు. మూల సూచికలు ఏర్పాటు చేసి.. గుంతలు పూడ్చితే ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుంది." - స్థానికులు

Warangal Khammam Highway Accident Zone :వర్ధన్నపేట మండలం ఇల్లంద వద్ద మూడు వారాల క్రితం రాజస్థాన్‌కు చెందిన లారీ ఆటోను ఢీకొట్టడంతో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. వారం రోజుల్లో.. లారీ ఇళ్లపైకి దూసుకెళ్లటం, కారు చెట్టును ఢీకొనటం, ద్విచక్ర వాహనం అదుపుతప్పి కూలీలకు తీవ్రంగా గాయాలైన సంఘటనలు వరుసగా జరిగాయి. అంతేకాకుండా ఇటీవల వర్ధన్నపేట ఎస్సై సైతం ప్రమాదానికి గురై ప్రాణాలతో బయటపడ్డాడు. ఇలా వరంగల్‌-ఖమ్మం జాతీయ రహదారిపై ప్రమాదాలు షరా మామూలు అయ్యాయిప్రమాదాలతో ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నా రహదారి నిర్వహణ అధికారులు పట్టించుకోవట్లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. సూచిక బోర్డుల ఏర్పాటుతో పాటు ప్రమాదకరమైన గుంతల్ని పూడ్చివేయాలని కోరుతున్నారు.

వరంగల్-కరీంనగర్ జాతీయ రహదారిపై కుంగిన వంతెన

Road Accident at Warangal : నిర్లక్ష్యం ఖరీదు... ఆరుగురు వలస కూలీలు మృతి

Last Updated : Sep 2, 2023, 12:04 PM IST

ABOUT THE AUTHOR

...view details