వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ ప్రచారాన్ని నిరసిస్తూ.. విద్యార్థులు ఆందోళన చేశారు.
తెరాస ప్రచారాన్ని అడ్డుకున్న విద్యార్థులు - వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ భాస్కర్
కాకతీయ విశ్వవిద్యాలయంలో తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారాన్ని నిరసిస్తూ.. విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు.
తెరాస ప్రచారాన్ని అడ్డుకున్న విద్యార్థులు
విద్యారంగ సమస్యలను పరిష్కరించకుండా తెరాస ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ భాస్కర్ రాగా.. అతని వాహనాన్ని విద్యార్థులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు స్టేషన్కు తరలించారు.
ఇదీ చదవండి:విమెన్స్ డే ప్రత్యేకం: ఇలా చేస్తే అన్నింటా మనమే రాణులం!