Warangal IT Hub: హైదరాబాద్ తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన ద్వితీయ శ్రేణి నగరంగా పేరుపొందటంతో వరంగల్‌ను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దాలని సర్కారు సంకల్పించింది. ఇందుకు అనుగుణంగా మడికొండ శివార్లలో 27 ఎకరాల్లో ఐటీ పార్క్‌ను 2016లో అభివృద్ది చేసింది. ఇక్కడ సైయెంట్, టెక్ మహేంద్ర సంస్ధలు కొత్త కార్యాలయాలను నెలకొల్పగా... గతేడాది జనవరిలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. భవిష్యత్తులో మరిన్ని సంస్థలు ఓరుగల్లు వైపు దృష్టి సారిస్తాయని వ్యాఖ్యానించారు. మంత్రి చెప్పినట్లుగానే నూతన కార్యాలయాలు ప్రారంభించేందుకు కొన్ని సంస్థలు సన్నద్ధమవుతున్నాయి. మరో దిగ్గజ కంపెనీ జెన్‌పాక్ట్ వరంగల్‌లో తన సేవలు ప్రారంభించనుంది.
అన్నివిధాల సహకారం అందిస్తాం...
హైదరాబాద్ ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌తో జెన్‌పాక్ట్ ప్రతినిధి బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా వరంగల్ నగరానికి జెన్‌పాక్ట్ కంపెనీని కేటీఆర్ ఆహ్వానించారు. ఐటీ పరిశ్రమ అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. నగరంలోని సౌకర్యాల, మానవ వనరుల కారణంగా ఐటీ కంపెనీలు ముందుకు వస్తున్నాయని... వీటన్నింటికి ప్రభుత్వం అన్నివిధాల సహకారం అందిస్తుందని వెల్లడించారు. ఇప్పటికే ఖమ్మం, కరీంనగర్‌లో ఐటీ టవర్లు ఏర్పాటుతో అనేక కంపెనీలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. త్వరలోనే మహబూబాబాబాద్, సిద్దిపేట, నిజామాబాద్‌లలో ఐటీ టవర్ పనులు పూర్తవుతాయన్నారు.
అందుకే వరంగల్‌ను ఎంచుకున్నాం...