వరంగల్ నగరంలో బుధవారం మంత్రి కేటీఆర్ పర్యటించనున్నందున రహదారులన్నీ పరిశుభ్రతంగా మారాయి. రహదారుల పక్కన ఉండే పిచ్చి మొక్కలు, చెత్తాచెదారాలను తొలగించి పెద్ద ఎత్తున పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నారు. రోడ్లపై ఉండే గుంతలను పూడ్చి మరమ్మతులు చేశారు. రహదారి పక్కన శౌచాలయాలను నిర్మించి వాటికి కొత్త రంగులను అద్దారు.
మంత్రి కేటీఆర్ పర్యటనకు ఓరుగల్లు ముస్తాబు - మంత్రి కేటీఆర్ పర్యటనకు సిద్ధమవుతోన్న ఓరుగల్లు
వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో బుధవారం మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. నగరంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందులో భాగంగా రహదారులన్నింటిని పరిశుభ్రంగా తయారుచేస్తున్నారు.

మంత్రి కేటీఆర్ పర్యటనకు సిద్ధమవుతోన్న ఓరుగల్లు
వాహనాలు ఢీకొని ధ్వంసమైన డివైడర్లను పునఃనిర్మించారు. మంత్రి నగరంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. వాటికి సంబంధించిన శిలాఫలకాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేశారు. పారిశుద్ధ్యం తదితర పనులకు సంబంధించిన పనులను నగర మున్సిపల్ కమిషనర్ నిత్యం పర్యవేక్షిస్తున్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో అనుమతి పొందిన ప్రైవేటు ల్యాబొరేటరీలు ఇవే..