వరంగల్‌లోని శివనగర్‌లో గ్రేటర్ వరంగల్ ఎన్నికల సన్నాహాక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పాల్గొన్నారు. తెరాస గెలుపే లక్ష్యంగా నియోజకవర్గంలోని కార్యకర్తలు పని చేయాలని కోరారు.
తెరాస గెలుపే లక్ష్యంగా పని చేయాలి: ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ - వరంగల్ అర్బన్ జిల్లా వార్తలు
గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో తెరాస గెలుపే లక్ష్యంగా పని చేయాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. వరంగల్‌లోని శివనగర్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల సన్నాహాక సమావేశంలో పాల్గొన్నారు.
తెరాస గెలుపే లక్ష్యంగా పని చేయాలి: ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్
తూర్పు నియోజకవర్గంలోని గుడిసె వాసులకు పట్టాలు ఇవ్వటంతో పాటు మురికివాడల్లో బస్తీదవాఖానా ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలోనే కార్మికులకు హెల్త్ కార్డులను అందజేస్తామని తెలిపారు. అనంతరం వివిధ పార్టీల నుంచి వచ్చిన నాయకులకు గులాబీ కండువా కప్పి స్వాగతం పలికారు.
ఇదీ చదవండి:స్ఫూర్తిదాయకం: వైద్యుడు లేని చోట.. ఈ రూపాయి డాక్టర్ సేవ..!