కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు, జనతా కర్ఫ్యూలో శ్రమించిన పోలీసులు, వైరస్ సోకకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుతోన్న పారిశుద్ధ్య సిబ్బంది, కరోనా వ్యాప్తిని నిలవరించడానికి నిత్యం ప్రయత్నిస్తోన్న రెవెన్యూ అధికారులు, వైరస్ సోకిన వారికి ప్రాణాలు లెక్కచేయకుండా వైద్యమందిస్తోన్న వైద్యులకు ఓరుగల్లు ప్రజలు చప్పట్లతో సంఘీభావం తెలిపారు.
'కరోనాను నిలువరించడంలో మావంతు సాయం చేస్తాం' - జనతా కర్ఫ్యూనకు ఉమ్మడి వరంగల్ జిల్లా మద్దతు
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు జనతా కర్ఫ్యూనకు మద్దతు తెలిపారు. జనగాం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్ గ్రామీణ, వరంగల్ పట్టణ, మహబూబాబాద్ జిల్లాల ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.
'కరోనాను నిలువరించడంలో మావంతు సాయం చేస్తాం'
ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల సేవకే అంకితమవుతున్న ప్రతి ఒక్కరికి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. కరోనా మహమ్మారిని నిలువరించడానికి ప్రభుత్వాలు, అధికారులు చేస్తున్న ప్రయత్నంలో తమ వంతు సహకారం అందిస్తామని వెల్లడించారు.
- ఇదీ చూడండి :దేశంలో 396కు చేరిన కరోనా కేసులు