మర్కజ్ ఘటనతో వరంగల్ నగరంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్నమొన్నటివరకూ పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడం వల్ల ఊపిరిపీల్చుకున్న అధికారులు తాజాగా నమోదైన.. కేసులతో యుద్ధ ప్రాతిపదికన చర్యలను ముమ్మరం చేశారు.
పాజిటివ్ కేసుల నమోదుతో అప్రమత్తం
వరంగల్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన కారణంగా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అధికారులు ఇంటింటికీ తిరుగుతూ ఇంట్లో ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు.
ఇంటింటికి సర్వే.. పాజిటివ్ కేసుల నమోదుతో అప్రమత్తమైన యంత్రాంగం
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు నగరంలోని ఇంటింటి తిరుగుతూ సర్వే జరుపుతున్నారు. ఇంట్లో ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. ఇటీవల దిల్లీ, విదేశాలకు వెళ్లి వచ్చిన వారి వివరాలను సేకరిస్తున్నారు. అనుమానం వచ్చిన వారిని వెంటనే క్వారంటైన్‌కి తరలిస్తున్నారు.
ఇవీచూడండి:ఒగ్గుకథ రూపంలో కరోనా అవగాహన