వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని అంబేడ్కర్ భవన్లో సోమవారం వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సర్వ సభ్య సమావేశం జరిగింది. రైతులకు నిరంతరం అందుబాటులో ఉంటూ మెరుగైన అవకాశాలు కల్పిస్తున్నామని బ్యాంకు ఛైర్మన్ మర్నేని రవీందర్ రావు అన్నారు. గతంలో పాలక వర్గం బ్యాంకుకు చెడ్డ పేరు తీసుకొచ్చిందని ఆరోపించారు.
'రైతులకు పారదర్శకంగా సేవలందించడమే మాలక్ష్యం' - వరంగల్ అర్బన్ తాజా వార్తలు
రైతులకు పారదర్శకంగా సేవలు అందించడమే లక్ష్యంగా వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పని చేస్తుందని ఆ బ్యాంకు ఛైర్మన్ మర్నేని రవీందర్ రావు అన్నారు. హన్మకొండలోని అంబేడ్కర్‌భవన్‌లో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సర్వసభ్య సమావేశం జరిగింది.
'రైతులకు పారదర్శకంగా సేవలందించమే మాలక్ష్యం'
ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలపై రైతులకు అతి తక్కువ వడ్డీతో పాటు, స్వల్పకాలంలో రుణాలు ఇస్తున్నామన్నారు. త్వరలోనే నూతనంగా మరో పది శాఖలు ఏర్పాటు చేసి మెరుగైన సేవలు అందిస్తామని పేర్కొన్నారు. త్వరలో 10 కోట్ల టర్నోవర్‌ను చేరుకుంటామని తెలిపారు.
ఇదీ చూడండి:6న అపెక్స్ కౌన్సిల్ సమావేశం.. జల వివాదాలపై చర్చ