వరంగల్ జిల్లాలో డీసీసీబీ, డీసీఎంస్ పదవులు ఏకగ్రీమయ్యాయి. డీసీసీబీ ఛైర్మన్గా మార్నేని రవీందర్రావు, డీసీఎంఎస్ ఛైర్మన్గా గుగులోతు రామస్వామి నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ ఛైర్మన్లుగా కుందూరు వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి ఎన్నికయ్యారు. హన్మకొండలోని హరిత హోటల్లో ప్రత్యేక పరిశీలకులు గ్యాదరి బాలమల్లు, మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ డైరెక్టర్లతో సమావేశమయ్యారు. అధిష్ఠాన నిర్ణయాన్ని తెలియజేశారు.
వరంగల్ డీసీసీబీ, డీసీఎంఎస్ పదవులు ఏకగ్రీవం - DCCB ELECTIONS UPDATES
రాష్ట్రంలో జరుగుతున్న డీసీసీబీ, డీసీఎంఎస్ పదవుల ఏకగ్రీవాలు కొనసాగుతున్నాయి. వరంగల్ జిల్లాలోని అన్ని పదవులు ఏకగ్రీవమయ్యాయి. డీసీసీబీ ఛైర్మన్గా మార్నేని రవీందర్రావు ఎన్నికయ్యారు.
![వరంగల్ డీసీసీబీ, డీసీఎంఎస్ పదవులు ఏకగ్రీవం WARANGAL DCCB AND DCMS ELECTIONS ARE UNANIMOUS](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6245972-thumbnail-3x2-pppp.jpg)
WARANGAL DCCB AND DCMS ELECTIONS ARE UNANIMOUS
అధిష్ఠానం ప్రకటించిన అభ్యర్థులకు అందరూ మద్దతు తెలుపటం వల్ల ఎన్నిక ఏకగ్రీవమైంది. గెలిచిన వారికి మంత్రులు, ప్రత్యేక పరిశీలకులు, ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు పూలదండలతో ముంచెత్తారు. ప్రతి రైతుకు అండగా ఉండేలా ప్రస్తుత నేతలు కృషి చేయాలని మంత్రులు సూచించారు.
వరంగల్ డీసీసీబీ, డీసీఎంఎస్ పదవులు ఏకగ్రీవం