వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణకు భద్రతాపరంగా అన్ని చర్యలు తీసుకున్నామని వరంగల్ పోలీసు కమిషనర్ ప్రమోద్ కుమార్ అన్నారు. ఈ క్రమంలో స్వామివారిని దర్శించుకున్న ఆయనకు ఆలయ పూజారులు దేవుడి శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలను అందజేశారు.
వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలకు పటిష్ఠ భద్రత: సీపీ
వరంగల్ అర్బన్ జిల్లా శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి వారిని వరంగల్ పోలీస్ కమిషనర్ పి. ప్రమోద్ కుమార్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు, పుజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
బ్రహ్మోత్సవాలకు నిర్వహణకు పటిష్ఠ భద్రత: వరంగల్ సీపీ
నేటి నుంచి ఈ నెల 18 వరకు జరిగబోయే కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సీపీ సమీక్ష నిర్వహించారు. జిల్లా నుంచి 500 మంది పోలీసు సిబ్బంది 3 షిఫ్ట్లలో విధులు నిర్వహిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహిస్తారని తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులు పోలీసులకు సహకరించాలని కోరారు.