తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ తరుణ్ జోషి - వరంగల్​లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ

గ్రేటర్ వరంగల్​ పురఎన్నికలు జరుగుతున్న పోలింగ్ కేంద్రాలను సీపీ తరుణ్ జోషి సందర్శించారు. నగరంలోని పలు కేంద్రాలను తనిఖీ చేసి ఓటింగ్ సరళిని పరిశీలించారు.

warangal cp tarun joshi visited polling centres
పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్న వరంగల్ సీపీ తరుణ్​ జోషి

By

Published : Apr 30, 2021, 2:24 PM IST

పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని వరంగల్ సీపీ తరుణ్ జోషి సూచించారు. గ్రేటర్ కార్పొరేషన్​లో పలు కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. సుబేదారి, కేయూసీ, ఇంతేజార్ గంజ్, మట్వాడా, మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ల పరిధిలోని కేంద్రాలను సందర్శించారు.

పోలింగ్ జరుగుతున్న తీరును సీపీ పర్యవేక్షించారు. పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. శానిటైజర్లు, మాస్కులు, ఫేస్ షీల్డ్​లు వినియోగించాలని సిబ్బందికి తెలిపారు. సీపీ వెంట సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పా, ఏసీపీలు జితేందర్ రెడ్డి, గిరికుమార్, ప్రతాప్ కుమార్ ఉన్నారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో 77 వేలు దాటిన కరోనా క్రియాశీల కేసులు

ABOUT THE AUTHOR

...view details