తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆమెను అత్యాచారం చేసి అంతమొందించాడు' - warangal murder

వరంగల్​ యువతి హత్య కేసులో పోలీసులు కీలక అంశాలు వెల్లడించారు. యువతిని హత్య చేసేముందు నిందితుడు అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు.

warangal cp ravinder about harathi murder case
'ఆమెను అత్యాచారం చేసి అంతమొందించాడు'

By

Published : Jan 11, 2020, 6:02 PM IST

వరంగల్‌లో ప్రేమోన్మాది యువతిని హత్య చేసేముందు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడితో మృతురాలికి 2015 నుంచే పరిచయం ఉందని తెలిపారు.

మరో వ్యక్తితో పరిచయం పెంచుకుని.... చాటింగ్‌ చేస్తోందనే అనుమానంతోనే దారుణంగా గొంతు కోసి హతమార్చాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. యువతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి... కుటుంబ సభ్యులకు అప్పగించారు.

అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి పక్కాగా ఆధారాలు సేకరించి... నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తామని సీపీ రవీందర్​ తెలిపారు.

'ఆమెను అత్యాచారం చేసి అంతమొందించాడు'

ABOUT THE AUTHOR

...view details