తెలంగాణ

telangana

ETV Bharat / state

'సెప్టెంబర్ 25 లోపు వేయి మరుగుదొడ్ల లక్ష్యాన్ని పూర్తిచేయాలి' - warangal corporation commissioner pamela satpathi

వరంగల్​ నగరంలో వేయి ప్రజా మరుగుదొడ్ల నిర్మాణాల లక్ష్యాన్ని గడువులోగా పూర్తి చేయాలని కమిషనర్​ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. పలు డివిజన్లలో అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు.

warangal corporation commissioner pamela on washroom construction
వేయి మరుగుదొడ్ల లక్ష్యానికి డెడ్​లైన్ సెప్టెంబర్ 25

By

Published : Sep 15, 2020, 11:27 AM IST

వరంగల్​ మహా నగరపాలక సంస్థ కమిషనర్​ పమేలా సత్పతి నగరంలోని 38వ డివిజన్​లోని రామారావుకాలనీ, జవహర్​ కాలనీల్లో పర్యటించారు. పలు ప్రాంతాల్లో నిర్మిస్తున్న మరుగుదొడ్ల పురోగతిని పరిశీలించారు. నాణ్యతతో కూడిన పనులు చేయాలని అధికారులను ఆదేశించారు.

మహానగరపాలక సంస్థ పరిధిలో వేయి మరుగుదొడ్ల లక్ష్యాన్ని ఈనెల 25నాటికి పూర్తి చేయాలని సూచించారు. కాంట్రాక్టర్లు త్వరితగతిన పనులు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. మరుగుదొడ్ల నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన గుత్తేదారులను హెల్డ్​లో పెడతామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details