కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వరంగల్ నగరపాలిక కమిషనర్ పమేలా సత్పత్రి ప్రజా ఆరోగ్యవిభాగంతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. నగరంలో నో మూవ్మెంట్ జోన్లుగా ప్రకటించిన 15 కాలనీల్లో మరోసారి సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయాలని సిబ్బందికి సూచించారు.
కరోనాపై వరంగల్ బల్దియా కమిషనర్ అత్యవసర సమావేశం - corona effect on warangal
వరంగల్ నగరాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటిండం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. బల్దియా కమిషనర్ పమేలా సత్పతి ప్రజా ఆరోగ్య విభాగంతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

కరోనాపై వరంగల్ బల్దియా కమిషనర్ అత్యవసర సమావేశం
మురికివాడల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లాలని పారిశుద్ధ్య కార్మికులను ఆదేశించారు. కార్మికులు విధులు నిర్వర్తించేటపుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలన్నారు. రహదారులపై ఉమ్మిన వారికి జరిమానా విధించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.